ప్రజాశక్తి-కడియం : ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ , పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డిని కడియం మండల జేసీఎస్ అధ్యక్షులు తాడాల చక్రవర్తి , రాష్ట్ర వైసిపి కార్యదర్శి గిరజాలబాబు మర్యాదపూర్వకంగా కలిశారు . రాజమహేంద్రవరం ఆర్ & బి గెస్ట్ హౌస్ కు బుధవారం విచ్చేసిన మిథున్ రెడ్డిని కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా మిథున్ రెడ్డి కడియం మండలంలో జరుగుతున్న జగనన్న నువ్వే మా నమ్మకం కార్యక్రమం వివరాలు చక్రవర్తి ని అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వై.స్టాలిన్, దుల్ల గ్రామ సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, కడియపులంక సొసైటీ చైర్మన్ తిరుమలశెట్టి శ్రీనివాస్, సాపిరెడ్డి సూరిబాబు, సాపిరెడ్డి కామేష్, బోడపాటి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.










