Mar 24,2023 22:44

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గార్డెనర్స్‌, రోడ్‌ మజ్దూర్‌ వర్కర్స్‌కు యూనిఫామ్‌, జోళ్లు, టవల్స్‌ ఇవ్వాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. మున్సిపల్‌ వర్కర్స్‌ గార్డెనర్స్‌ అండ్‌ రోడ్‌ మజ్దూర్‌ వర్కర్స్‌ సమస్యలపై సిఐటియు జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు, వివరించారు. 30 ఏళ్లుగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న గార్డెనర్స్‌కు యూనిఫామ్స్‌, జోళ్లు, టవల్స్‌ ఇప్పించమని కోరారు. దీనిపై కమిషనర్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష, కార్యాదర్శులు ఎన్‌.సత్యన్నారాయణ, పెంకే కృష్ణ, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.సత్యనారాయణ, కోశాధికారి ఎన్‌.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు ఎం.వెంకటరమణ, నాగేశ్వరరావు, అప్పారావు, సూర్యనారాయణ, పోసుబాబు, సాల్మన్‌రాజు, పోతురాజు, సుబ్బారావు పాల్గొన్నారు.