Apr 19,2023 11:46

ప్రజాశక్తి-ధవళేశ్వరం : రాజమహేంద్రవరం పద్మశాలీయ సంఘ నూతనకమిటీ కార్యవర్గ సమావేశం తుమ్మలావలో గల భద్రావతీ భావనా ఋషి దేవాలయం ఆవరణలో గల జొన్నాదుల సుబ్బారావు కార్యాలయ భవనంలో ఎన్నిక ఆమంచి ఆంజనేయ గురుస్వామి, తమ్మిశెట్టి హనుమంతరావు, ఇమంది. మోహనరావు, జామిశెట్టి గాంధీ, ఉడతా రంగారావు, నేమాల రమణల పర్యవేక్షణలో జరిగింది‌. అద్యక్షులుగా యర్రమోతు ధర్మరాజు, గౌరవ అద్యక్షులుగా జామిశెట్టి. గాంధీ, ప్రధాన కార్యదర్శిగా ఇమంది.కన్నారావు, కోశాదికారిగా నీలం.వీరవెంకట సత్యనారాయణ (బాబ్జీ)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ పదవీ కాలం రెండేళ్ళు, మాజీ కమిటీ అద్యక్ష, కార్యదర్శులు తంగెళ్ళ.హరికిషోర్(బాబి), చిందం.రాదాకిషన్ అకౌంట్ పుస్తకాలు, బీరువా తాళాలు ధర్మరాజు కు అందించారు, పద్మశాలీ కుల బాంధవులను అందరినీ కలుపుకుని ప్రతీ పేటలో ప్రాతినిద్యం కల్పించి మిగిలిన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని జామిశెట్టి. గాంధి అన్నారు. ఇప్పటి వరకు సహకరించిన విధంగా మా కమిటీకి సహకరించి మన కులంలో ఉన్న పేదలకు మనోదైర్యం కలిగించేందుకు మేము చేయు కార్యక్రమాలకు చేయూత నందించ వలసిందిగా ధర్మరాజు కోరారు.