ప్రజాశక్తి కడియం: విద్యాప్రదాతల స్ఫూర్తి మహోన్నతమని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి కళాసేవా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, గౌరవా అధ్యక్షులు అడపా సుబ్రహ్మణ్యం, చిలుకూరి శ్రీనివాసరావు, తోరాటి వసంతరావు సంయుక్తంగా పేర్కొన్నారు. కడియం శాఖా గ్రంధాలయం, చెళ్లపిళ్ల సంస్థ
ఆధ్వర్యంలో గ్రంథాలయ అధికారి శెట్టిపల్లి శ్రీదేవిఅధ్యక్షతన జరిగిన వేసవి శిబిరంలో ఆదివారం విద్య కోసం పాటుపడ్డవారికీ, రైతు నాయకులకు సత్కారం జరిగింది. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కడియం మండలాన్ని జిల్లాలో మొదటి స్థానంలో నిలిపిన ఎంఈఓ వి లజపతిరాయ్, కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణం కోసంస్థలాన్నిసమకూర్చివేలాదిమంది విద్యావంతులు కావడానికి సహకరించిన బొమ్మిరెడ్డి వంశీయులు బొమ్మిరెడ్డి చక్రధర్ రావుకి, రైతు సంఘం అధ్యక్షులుగా ఉండి దశాబ్దం పాటు కడియం ఆవనుసమస్యలు తీర్చిన చిక్కాల ఈశ్వరరావు, ఆధ్యాత్మికంగా ఉంటూ కడియం లో పితృతర్పణ శాల, పేదలకు చిన్ని చిన్ని ఇల్లు కట్టిస్తూ సేవలో ముందుంటున్న రైతు నాయకుడు ఉప్పులూరి చిట్టియ్యలను ఘనంగా సన్మానించి వారి సేవలను ప్రశంసించారు. గ్రంథాలయాధికారి శ్రీదేవి మాట్లాడుతూవేసవి శిభిరం పిల్లల ఆనందంగా సద్వినియోగం చేసుకుంటున్నారు అన్నారు. ఉపాధ్యాయులుకుమ్మరపూడి రవిబాబు, కే దొరబాబు, కొత్తూరి నాగేశ్వరరావు పుస్తక విజ్ఞానం గురించి పిల్లలకు సెల్ఫోన్ ప్రభావం గురించివివరించారు.ఈకార్యక్రమంలో రైతు నాయకులు బొమ్మిరెడ్డి వెంకట్రావు, బొమ్మిరెడ్డి కృష్ణమూర్తి బొమ్మిరెడ్డి రమేష్, బొమ్మిరెడ్డి తమ్మయ్య, బొమ్మిరెడ్డి బుజ్జి య్య, బొమ్మిరెడ్డి శ్రీనివాసు, బొమ్మిరెడ్డి నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.










