ప్రజాశక్తి - ఉండ్రాజవరం : గ్రామ వాలంటీర్లను తమ కుటుంబ సభ్యులుగా పింఛన్ దారులు భావిస్తున్నారన్నారు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. శనివారం మండలంలోని ఉండ్రాజవరంలో మొదటి విడతగా వేలివెన్ను, కాల్దారి, పసలపూడి, సూర్యారావు పాలెం, చిలకపాడు, వడ్లూరు, సత్యవాడ గ్రామాల వాలంటీర్లకు ఏర్పాటుచేసిన అవార్డుల కార్యక్రమం, వాలంటీర్లకు వందనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదటి తేదీ తెల్లవారుజామునే పింఛనందిస్తున్న వాలంటీర్లను తమ మనవడు, తమ మనుమరాలు పింఛను డబ్బులు ఇంటికి తెచ్చిస్తున్నారు అని చెప్పుకుంటున్నారన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు వాలంటీర్లన్నారు. వాలంటీర్లు సేవా భావంతో పనిచేస్తూ కేటగిరి వారీగా సేవా మిత్ర, సేవారత్న, సేవావజ్రలుగా గుర్తించి, ప్రభుత్వం అవార్డులు అందించి, ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, జడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య, వైస్ ఎంపీపీలు, షాజహాన్, ఆయా గ్రామ సర్పంచులు, కొఠారు సత్యనారాయణ, నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, ఎంపీడీవో, ఈఓపిఆర్టి, అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.










