Sep 21,2023 13:19

ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి జిల్లా) : నియోజవర్గ స్థాయి నిడదవోలులో జరిగిన పాటల పోటీల్లో ఎస్వీఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ కాకరపర్రు చెందిన చెందిన విధ్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక కావడంతో మండల విద్యాశాఖ అధికారులు బొబ్బిలి బాలసుబ్రమణ్యం  షేక్ సూర్జన్  క్రీడాకారులను అభినందించారు జిల్లా స్థాయికి ఎంపిక కాబడిన క్రీడాకారులు అండర్ -14 ఖోఖో బాలురు విభాగం డి.వి.నాగరాజు ఎస్ .నాగ సత్యనారాయణ ఏ. ఆకాష్ పి.లివెన్ ఎం.సైతు మహేష్ జి.చైతన్య సత్యనారాయణలను స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రామచంద్రమూర్తి అభినందించి క్రీడాకారులు రాష్ట్రస్థాయికి వెళ్లే విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. క్రీడల్లో రాణించడానికి విద్యార్థులను మరింతగా తీర్చి దిద్దిన పి.డి. సుందర్ జేమ్స్ ను అభినందించారు భవిష్యత్తులో పాఠశాల నుండి మరింత మందిని క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఇతర సిబ్బంది అభినందించారు.