Feb 11,2023 16:23

ప్రజాశక్తి-చాగల్లు(తూగో) :  ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశం చాగల్లు మండలం చాగల్లులో శనివారం ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘ సమావేశం సంఘం అధ్యక్షులు కోడి నాగేశ్వర రావు అధ్యక్షతన జరిగింది .కోడి నాగేశ్వరావు మాట్లాడుతూ సర్వీసు పెంన్సనర్స ఫ్యామిలీ పెన్షనర్స ఫిబ్రవరి నెల ఆఖరు లోపల సంబంధిత ట్రెజరీ లకు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని తెలిపారు సమావేశంలో సభ్యయల పుట్టినరోజు   సందర్భంగా కేక ను కట్ చేశారు. చిన్నాయిగూడెం జెడ్పీ హైస్కూలు హెచ్ ఎం శ్రీనివాసరావు మృతికి సంతాపంగాచ మౌనంపాటించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సమావేశంలో సంఘాన్ని బలోపేతం చేయడానికి సభ్యులందరిని కలిసి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయడానికి క్యాంపెయిన్ నిర్వహించాలని తీర్మానించారు కార్యక్రమంలో మాజీ సంఘం అధ్యక్షులు డి నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు డేగల నాగేశ్వరరావు కార్యదర్శి కే ఎస్ ఎన్ మూర్తి కోశాధికారి ఎ రామారావు వెచ్చా గంగాధరం బచ్చు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు