Mar 18,2023 15:43
  • "జగన్ పతనం ఖాయం-విజయోత్సవ కార్యక్రమంలో ఎంపీపీ ప్రసాద్"

ప్రజాశక్తి-కడియం : రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలలో విజయం సాధించిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక కార్యాలయం వద్ద మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పీ.పీ వెలుగుబంటి ప్రసాద్ మాట్లాడుతూ, వెలువడిన ఎన్నికల ఫలితాలే మార్పుకు నాంది అని, జగన్ ప్రభుత్వ పతనం ఖాయమని, రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం విజయం ఖాయమని ఆయన అన్నారు. రాష్ట్ర రైతు నాయకులు మార్గాని సత్యనారాయణ, అన్నదేవుల చంటి   , రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పితాని శివరామకృష్ణ, వాసంశెట్టి నాగబాబు, ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, శీలం రవి,  షేక్ సిద్దయ్య, తామేళ్ళ అయ్యప్ప, బొరుసు వెంకటేశ్వరరావు, మర్రెడ్డి రమేష్, పాలపర్తి ప్రకాష్, గోరు వీర నాగేశ్వరావు, జోగి చక్రవర్తి, వాసంశెట్టి బాలాజీ, దంగేటి శ్రావణ్,  తదితరులు పాల్గొన్నారు.