Jan 28,2023 15:51

ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీ నిర్మాణ పనులను శనివారం రాజమహేంద్రవరం డి ఎల్ డి ఓ గోకవరం మండలం ప్రత్యేక అధికారిణి పి వీణాదేవి గోకవరం ఎంపీడీవో కే వి ఎస్ఎస్ ఎస్ మూర్తి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎల్ డిఓ వీణాదేవి మాట్లాడుతూ కొత్తపల్లిలో జగనన్న కాలనీ నిర్మాణ పనులు 10 శాతం పూర్తయ్యాయని ఇంకా 90 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. కొత్తపల్లి జగనన్న కాలనీ లేఅవుట్లో 335 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగిందని వీటిలో 18 గృహాలు పూర్తయ్యాయని లేంటిల్ లెవెల్ 15 గృహాలు బేస్మెంట్ లెవెల్ 30 గృహాలు మిగిలిన 272 గృహాలు గాను ఇంకా ప్రారంభించలేదని తెలిపారు. 335 గృహాలకు గాను 10 శాతమే పూర్తయ్యాయని ఇంకా 90 శాతం పూర్తి కావలసి ఉందని తెలిపారు. 90% గృహ నిర్మాణ పనులు త్వరత గతిని పూర్తి చేయాలని అధికారులును ఆదేశించారు. 272 మంది లబ్ధిదారులకు అవగాహన కల్పించి గృహాల నిర్మాణం చేసే దిశగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అనంతరం జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న లబ్ధిదారులను నిర్మాణం పనులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచుమర్తి కాటమ స్వామి ఈఓపిఆర్డి ఎం రాజేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి చిన్న కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీఆర్వో వెంకటరమణ వైసిపి నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.