ప్రజాశక్తి-గోకవరం : మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో ది గోకవరం ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆదివారం కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మాజీ మండల అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దొడ్డ విజయ భాస్కర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరి కొన్ని బాధ్యతలు తీసుకోవడం జరిగిందన్నారు. అప్పటినుండి పార్టీకి పార్టీ అభివృద్ధికి పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేయడం జరిగిందన్నారు బాధ్యతగా వ్యవహరించిన వారి పట్ల కేడర్ గుర్తించలేదని వాపోయారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా పార్టీ విధానాలపై మనస్థాపం చెంది ఈ రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నా రాజీనామా పాత్రలును కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుకి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాజీనామా గల ప్రధాన కారణాలు అతి త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ఇప్పుడు తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని వెనుకకు తీసుకొనే ప్రసక్తే లేదని తెలిపారు.










