ప్రజాశక్తి-గోకవరం మండలంలోని వివిధ పాఠశాలలను ఆర్‌జెడి జి.నాగమణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిలో భాగంగా వీరలంకపల్లి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ 8వ తరగతికి సంబంధించిన విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌ల వినియోగాన్ని గురించి అరా తీశారు. లెక్కల్లో స్క్వేర్స్ ట్రయాంగిల్ ఏర్పడే విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 9వ తరగతి విద్యార్థులు హిందీ చదవ గలుగుతున్నారా లేదా అని పరిశీలించారు. పాఠశాల టాయిలెట్స్ పరిశుభ్రతను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం నిర్వహించిన స్టాఫ్ మీటింగ్‌లో విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాల నిర్వహణ పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం కామరాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో డివైఇఒలు తిరుమలదాసు, రామన్నదొర, ఎంఇఒలు బి.గౌరమ్మ కుశలవదొర పాల్గొన్నారు.










