Sep 28,2023 23:25

ప్రజాశక్తి - యంత్రాంగం
కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత గుఱ్ఱం జాషువా జయంతి కార్యక్రమాలు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమహేం ద్రవరం గుర్రం జాషువా 128 జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్‌ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద జాషువా చిత్రప టానికి ఎంపి మార్గాని భరత్‌, వైసిపి సిటి కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనవాస్‌ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు పాల్గొని మాట్లాడారు. కడియం స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాలలో గుఱ్ఱం జాషువా జయంతిని పాఠశాల తెలుగు విభాగం అధ్యక్షులు గొల్లపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకుడు గిరిజాల బాబు, కవి డాక్టర్‌ నీలకంఠరావు పాల్గొన్నారు. అలాగే వేమగిరి బుద్ధవిహార్‌లో యార్లగడ్డ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్య క్రమంలో ఎంఇఒ వి.లజపతి రారు పాల్గొ న్నారు. కొవ్వూరు రూరల్‌ స్థానిక ఎల్‌ఐసి సెంటర్లో దళిత నాయకులు పెనుమాక జయ రాజు ఆధ్వర్యంలో జాషువా విగ్రహనికి. పూల మాలలు వేసి 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.