Mar 04,2023 23:23

ప్రజాశక్తి - ధవళేశ్వరం
ఐకెపి యానిమేటర్లకు కనీస వేతనాలు చెల్లించాలని యానిమేటర్ల సంగం ఉమ్మడి జిల్లా సమావేశం డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ధవళేశ్వరంలోని సిఐటియు కార్యాలయంలో యూనియన్‌ నాయకులు గంగాభవాని, ప్రమీల అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి మాట్లాడారు. యానిమేటర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు. రాజకీయ వేధింపులతో తొలగించిన యానిమేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. యానిమేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం ప్రమీల మాట్లాడుతూ అనేక చోట్ల ఎపిఎం, సిసిలు యానిమేటర్లను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. దీనికి నిదర్శనమే అయినవిల్లి మండలంలో జరిగిన ఘటన అన్నారు. తొలగించిన విఒఎలను ఏళ్ల తరబడి విధుల్లోకి తీసుకోకుండా రోడ్డున నెట్టేస్తున్నారని వాపోయారు. తప్పులు చేసిన కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన ఎపిఎం మాత్రం ఉద్యోగంలో కొనసాగుతున్నారన్నారు. వెంటనే తొలగించిన విఒఎలను విధుల్లోకి తీసుకో వాలన్నారు. ఈ సమావేశంలో మేరి, సుబ్బలక్ష్మి, ఇ.సంతోషమ్మ, జ్యోతి, విజయ, కాంతరత్నం, వివిధ మండలాల యానిమేటర్ల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు