Mar 31,2023 23:16

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వేణుగోపాలకృష్ణ

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
విలువలతో కూడిన జర్నలిజం అవసరమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో సి.రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో 'జర్నలిజంలో డిప్లమో కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడారు. పట్టణ - గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచడం, జర్నలిజంలో విద్యార్హత కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నార. ఇందులో భాగంగా ఈ కోర్సును తీసుకొచ్చిందన్నారు. కరస్పాండెన్స్‌ విధానంలో (ఆన్‌ లైన్‌) క్లాసుల నిర్వహణ ఉంటుందన్నారు. జర్నలిస్ట్‌లతో పాటు, జర్నలిజంపై ఆసక్తి ఉన్న యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు కోసం ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ ద్వారా 8,699 మంది జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డులు అందించామని ఆయన తెలిపారు. ప్రెస్‌ అకాడమీ రాష్ట్ర చైర్మన్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కోర్సు కోసం నాగార్జున యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని తలిపారు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ష్ట్ర్‌్‌జూర://జూతీవరఝషaసవఎy.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌ సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను ఏప్రిల్‌ 15లోగా అందించాలన్నారు. జర్నలిస్టులకు రూ.1,500, జర్నలిజం పట్ల అభిరుచి కలిగిన ఇతరులకు రూ.2వేలు ఫీజుగా నిర్ణయించామన్నారు. ప్రెస్‌ సెక్రటరీ, ప్రెస్‌ అకాడమీ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ పేరే డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలని కోరారు. జర్నలిస్టులకు ఇంటర్మీడియేట్‌, ఇతరులకు డిగ్రీ కనీస విద్యార్హత ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు ఎఆర్‌వి.సత్యనారాయణమూర్తిని, చిరుకూరి సాయిబాబాలను మంత్రి వేణు, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని సత్కరించారు. ఈ కారక్రమంలో ఎపి ప్రెస్‌ అకాడమీ అకాడమిక్‌ డైరెక్టర్‌ ఎల్‌వి.కృష్ణారెడ్డి, కార్యదర్శి బాల గంగాధర్‌తిలక్‌, ఒఎస్‌డి ఎస్‌.శ్రీనివాస్‌జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.