అవార్డు ఇచ్చి సత్కరిస్తున్న నిర్వాహకులు
ప్రజాశక్తి -దేవరపల్లి
దేవరపల్లికి చెందిన నవచైతన్య యువజన సంఘం సంస్థ ప్రతినిధి, నారీ శక్తి పురస్కార్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత విజయ నిర్మలకు విశ్వరూపిని అంతర్జాతీయ ఉత్తమ మహిళా అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ కళామందిరంలో ఆర్ట్ ఆఫ్ లర్నింగ్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును స్వీకరించారు. సామాజిక సేవారంగంలో చేసిన సేవలకు, మహిళల అభివృద్ధికి తీసుకున్న చర్యలకు ఆమెకు విశ్వరూపిణి అంతర్జాతీయ ఉత్తమ మహిళా అవార్డు మరియు లెజెండ్ ఆఫ్ సోషల్ వర్క్, లైఫ్ టైం అచీవ్‌మెంట్, మదర్ థెరిసా అవార్డులు దక్కాయి. అంతేకాకుండా ఆమె పేరును విక్టరీ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రత్యేక ఉన్నత స్థానంలో నమోదు చేస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.










