Feb 09,2023 22:53

ప్రజాశక్తి-రాజానగరం నియోజకవర్గంలో విద్యుత్‌ సమస్య లేకుండాలని విద్యుత్‌ సబ్‌-స్టేషన్ల నిర్మిస్తున్నామని ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు. మండలంలోని రాధేయపాలెంలో రూ.2.8 కోట్ల, వెలుగుబంద జగనన్న కాలనీలో రూ.5 కోట్లతో విద్యుత్‌ ఉప కేంద్రానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మరో ఐదారు ప్రాంతాల్లో ఉప కేంద్రాల నిర్మాణానికి ప్రతిపాదించామని, త్వరలో అనుమతులు, నిధులు మంజూరై పనులు ప్రారంభించాలని ఇపిడిసిఎల్‌ అధికారులను కోరామన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన సబ్‌-స్టేషన్లలో పనులు పూర్తయ్యి విద్యుత్‌ సరఫరా జరుగుతోందన్నారు. వెలుగుబందలో 11,719 గృహాలకు విద్యుత్‌ అందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి వాసంశెట్టి పెద వెంకన్న, మండల కన్వీనర్‌ దూలం పెద్ద, ఎంపిపి మందారపు వీర్రాజు, సీతారత్నం, మందారపు వీర్రాజు, గండి నానిబాబు, కొలపాటి వెంకన్న, ప్రగాడ గోవిందు, నాతిబోయిన రాంబాబు, నురుకుర్తి దుర్గాశ్రీనివాస్‌, విద్యుత్‌ శాఖ అధికారులు ఎస్‌ఇ టివిఎస్‌ఎన్‌.మూర్తి, ఇఇ శామ్యూల్‌, ఎడిఇ నటరాజన్‌, ఎఇ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.