ప్రజాశక్తి - రాజమహేంద్రవరం విద్యార్థులు లక్ష్యం నిర్ధేశించుకుని పక్కా ప్రణాళికతో ఉన్నత శిఖరాలకు అధిరోహించాని కలెక్టర్ మాధవీలత సూచించారు. మలబార్ గోల్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ప్రోగ్రాం కింద 24 ప్రభుత్వ కళాశాలల్లో 406 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్స్ మంజూరు చేసంది. సోమవారం వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.37.52 లక్షల స్కాలర్‌షిప్స్‌ను కలెక్టర్ మాధవీలత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల ఆధునీకరణతో పాటు మౌలిక సౌకర్యాలను కల్పించిందన్నారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, బిసి రారు అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ లక్ష్యం నిర్ధేశించుకుని, విద్యార్థులు అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షిం చారు. మలబార్ రాజమండ్రి స్టోర్ హెడ్, కె.ఫెబిన్, మేనేజర్, కె.వెంకటలకీëపతి పాల్గొన్నారు.










