ప్రజాశక్తి - గోపాలపురం విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని డిఇఒ ఎస్.అబ్రహాం తెలిపారు. శనివారం మండలంలోని గోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొవ్వూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గుడ్డిగూడెం ప్రాథమిక పాఠశాల, సాగిపాడు ప్రాథమిక పాఠశాల డిఇఒ అబ్రహాం ఆకస్మిక తనిఖీ చేశారు. 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ట్యాబ్ నిర్వహణలో అధమ శాతం నమోదై నందున గోపాలపురం ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, కొవ్వూరుపాడులో ఒకరికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. గుడ్డిగూడెం, సాగిపాడు పాఠశాలలో మూడో తరగతి, ఐదో తరగతి విద్యార్థుల వర్కు బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ వర్క్‌లను పరిశీలించి సంతప్తిని వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వహణ, పరిసరాల శుభ్రత, మంచినీటి సౌకర్యం రన్నింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌లను పరిశీలించారు. సిలబస్ ప్రకారం అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ విద్యార్తుల చదువు విషయంలో అప్‌డేట్‌గా ఉండాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ జి.శ్రీనివాసరావు హెచ్‌ఎంలు సోమశేఖర్, శేషారత్నం పాల్గొన్నారు.










