ప్రజాశక్తి - చాగల్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఆదివారం దారవరంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వనిత పాల్గొన్నారు. ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ.3 లక్షల చెక్కును లబ్ధిదారు మద్దాల నాగలక్ష్మికి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిం చేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరిస్తున్నారని తెలిపారు. నాడు - నేడుతో సర్కారు పాఠశాలలను కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేశారన్నారు. విద్యార్థుల కోసం పలు పథకా లను నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులకు ము ఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం.రవి ప్రసాద్, ఎంపిపి మట్టా వీరస్వామి, జడ్‌పిటిసి ఉపాధ్య క్షులు పోసిన శ్రీవిద్య, ఎంపిడిఒ బొలిశెట్టి రాంప్రసాద్, ఎఎంసి చైర్మన్, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, గ్రామ సర్పంచులు, సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










