May 09,2023 00:23

ప్రజాశక్తి-యంత్రాంగం పలుచోట్ల సోమవారం విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రారంభించారు. రాజమహేంద్రవరం సీతంపేట గ్రంథాలయంలో శిబిరాన్ని నగర విద్యాశాఖ అధికారి దిలీప్‌ కుమార్‌ ప్రారంభించారు. మాతశ్రీ విద్యాసంస్థ డైరెక్టర్‌ అరిగెల బాబు, చెక్క తాతారావు, కె.సుగుణ కుమారి, రిసోర్స్‌ పర్సన్స్‌ కృష్ణ మోహన్‌, పిచ్చుక రాంబాబు, ఎబి.శర్మ, సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు. కొవ్వూరు రూరల్‌ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్వంలో కొవ్వూరులో వేసవి విజ్ఞాన శిబిరాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భావన రత్నకుమారి ప్రారంభించారు. లైబ్రేరియన్‌ త్రినాథ్‌ పాల్గొన్నారు. కడియం గ్రంథాలయంలో నిర్వహించే వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఇఒ లజపతిరారు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసు అన్నారు. గ్రంథాలయంలో 35 రోజులు పాటు నిర్వహించే వేసవి శిక్షణా శిబిరాన్ని ఎంఇఒ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి శెట్టిపల్లి శ్రీదేవి నిర్మల, దేవరపు నిలకంఠం, హనుమంతరావు, వేంక టేశ్వర రావు, ఉపాధ్యాయులు భద్రరావు, నాగేశ్వరావు, కృష్ణమూర్తి, అబ్బులు పాల్గొన్నారు. చాగల్లు గ్రంథాలయంలో శిబిరాలు ఘనంగా ప్రారంభించారు. ఉప సర్పంచ్‌ ముళ్లపూడి ఉదయ భాస్కర్‌, చంద్రవరంంలో సర్పంచ్‌ మద్దిపాటి శ్రీరామ మూర్తి ప్రారంభించారు. సానబోయిన అర్జున్‌ రావు, లైబ్రేరియన్‌ గద్దె శ్రీనివాసరావు, కె.సుమన్‌ కుమార్‌ పాల్గొన్నారు. అనపర్తి శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్‌ జి.అభిలాష్‌ ప్రారంభించారు. పెరవలి ముక్కామల గ్రంథాలయంలో సర్పంచ్‌ కేతా త్రిమూర్తులు శిబిరాన్ని ప్రారంభించారు. వైస్‌ ఎంపిపి వేండ్ర శ్రీనివాస్‌, గండేపల్లి రామకష్ణ, సూర్య నారాయణ, కరుటూరి విశ్వనాథం, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దేవరపల్లి గ్రంథాలయంలో సర్పంచ్‌ కడిమి వీరకుమారి వేసవి విజ్ఞానశిబిరం ప్రారంభించారు. భాష్యం స్కూల్‌ ప్రిన్సిపల్‌ పేరయ్య నాయుడు, ఉపాధ్యాయులు రామారావు, గ్రంథపాలకుడు కెవికె.ప్రసాద్‌ పాల్గొన్నారు.