ప్రజాశక్తి - ఉండ్రాజవరం రైతులు తమ భూముల కచ్చితమైన డిజిటల్ రికార్డులను డ్రోన్ రీ సర్వే ద్వారా పొందవచ్చని జెడ్‌పిటిసి నందిగం భాస్కర రామయ్య అన్నారు. గురువారం వేలివెన్నులో డ్రోన్ సర్వేను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డిటి ఎన్.జయలక్ష్మి, సర్వేయర్ వి.నాగేంద్రబాబు, టీమ్ ఇన్‌ఛార్జి జివిఎం.నాయుడు, గ్రామ సర్వేయర్లు, విఆర్‌ఒలు మురళి, ఏసుపాదం, శ్రీనివాసు పాల్గొన్నారు.










