ప్రజాశక్తి -గోకవరం ఆర్‌టిసి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు, ఎపి జెఎసి అమరావతి ప్రధాన కార్యదర్శి వైవి.రావు మృతి ఉద్యోగులందరికీ తీరని లోటని ఎంప్లాయిస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ పైడిమల్ల లక్ష్మణరావు అన్నారు. సోమవారం గోకవరం ఆర్‌టిసి డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన సంతాప సభలో వైవి.రావుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైవి.రావు ఆర్‌టిసి ఉద్యోగులందరికీ 43 శాతం పేస్కేలు సాధించడంలో, ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడంలో చురుకైన పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అక్కిరెడ్డి కృష్ణ, ప్రగడ ప్రసాద్, శ్రీను, ఆర్‌బి.దొర, దేవుడు శ్రీను, ఫణి, సురేష్, ప్రసాద్, జేమ్స్ పాల్గొన్నారు.










