ప్రజాశక్తి - నిడదవోలు, కడియం
ప్రకాశం జిల్లా టంగుటూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రాయవరం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త. సవలం హనుమాయమ్మను అత్యంత అమానుషంగా ట్రాక్టర్‌తో గుద్ది చంపిన వైసిపి నాయకుడు కొండలరావును కఠినంగా శిక్షించాలని, హనుమాయమ్మ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని యూనియన్ గౌరవాధ్యక్షులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నిందితుని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని నినదించారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ సోమేశ్వరరావుకి వినతి పత్రాన్ని అందించారు. యూనియన్ నాయకులు మేరీ విక్టోరియా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో మహిళకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాజకీయ వేధింపులు భరించలేక పోతున్నామని విమర్శించారు. సూర్యాకాంతం మాట్లాడుతూ హనుమాయమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ జరీనా బేగం, జల్లూరి రత్నశ్రీ, డి.వెంకటరమణ, విమలకుమారి, పార్వతి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కడియం దేవీచౌక్ సెంటర్‌లో బుధవారం రాత్రి అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.బేబిరాణి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ్ట మానవహారం నిర్వహించారు. మరణించిన కార్యకర్త కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కొండలరావుని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు. అంగన్వాడీలపై రాజకీయ జోక్యం ఎక్కువైందన్నారు. కొందరు వైసిపి నాయకులు మితిమీరి ప్రవర్తిస్తూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి దుర్మార్గమైన ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వై.సుజాత, పి.సుజాత, కె.ఏడుకొండలు, ఎన్.మేరీ, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.










