ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరంలోని కోర్టుల ప్రాంగణంలో వైసిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ మార్గాని భరత్‌రామ్, వైసిపి నగర అధ్యక్షుల అడపా శ్రీహరి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ న్యాయవాదులు, కక్షిదారుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తొలిరోజు 100 మంది న్యాయవాదులు, 300 మంది కక్షిదారులకు చెరకు రసం, బటర్‌మిల్క్‌ను అందించారు. అనంతరం ఎంపీ భరత్‌ను న్యాయవాదులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సాధిక్ హుస్సేన్, లీగల్ సెల్ సభ్యులు పివిబిఎస్.రాజు, హసీనా బేగం, వైసిపి నాయకులు స్టాలిన్, రామారావు చౌదరి, అబ్దుల్ ఆరిఫ్, కాశి శ్రీనివాస్, యార్లగడ్డ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










