Jul 09,2023 00:26

ప్రజాశక్తి-యంత్రాంగం
మాజీ సిఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లాలో శనివారం వైసిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ సేవలు చిరస్మరణీమని అన్నారు.
రాజానగరం స్వర్గీయ మాజీ సిఎం వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాజానగరం జెడ్‌పి హైస్కూలు ఆవరణలో జిఎస్‌ఎల్‌ ,సుభ్రద ఆసుప్రతి ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనిలో 40 మంది వైద్య నిపుణులు 14 రకాల విభాగాల్లో రోగులకు పరీక్షలు చేశారు. ఈ శిబిరాన్ని ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ శ్రీమతి రాజశ్రీ, రాజానగరం మండల కన్వీనర్‌ దూలం పెద్ద, జెడ్‌పిటిసి సభ్యుడు వాసంశెట్టి పెద్ద వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ఆదికవి నన్నయ్య ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు అన్నారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో వైఎస్‌ఆర్‌ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య టి. అశోక్‌, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ స్థానిక బొమ్మూరు సెంటర్‌ వద్ద వైఎస్‌ఆర్‌ జయంతిలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వైసిపి రాజమహేంద్రవరం రూరల్‌ కో ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మూరు గ్రామం వద్ద నిర్వహించిన బొమ్మూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో 16 వ వార్డు ఇంచార్జి గోందేశీ .శ్రీనివాస్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు మద్దాల అను, జిల్లా వికలాంగుల సెల్‌ అధ్యక్షులు పోసికుమార్‌, హితకారిణి ట్రస్ట్‌ సమాజం డైరెక్టర్‌ సరితా రాణి, బొమ్మూరు నాయకులు రామారెడ్డి, మచ్చేటి శివ, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరంలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి మాజీ ఎంపిటిసి సభ్యుడు సాధనాల. శివ, షట్టర్‌ బాషా, రేగుళ్ల రాజు తదితరులు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. నిడదవోలు వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్‌ పేషేంట్లకు ఫ్రూట్స్‌, బ్రెడ్లు ఎంఎల్‌ఎ జి. శ్రీనివాస్‌ నాయుడు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ భూపతి ఆదినారాయణ, ముల్లపూడి శ్రీనివాస్‌ చౌదరి, కౌన్సిలర్లు గోపిరెడ్డి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. దేవరపల్లి దేవరపల్లి బస్టాండ్‌ సమీపంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి గోపాలపురం ఎంఎల్‌ఎ తలారివెంకట్రావు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులుఅర్పించారు. కార్యక్రమంలో ఎంపిపి కె.దుర్గారావు, ఎఎంసి గన్నమని జనార్దనరావు, గ్రామ సర్పంచ్‌ కడిమి వీరకుమారి తదితరులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల్లో రైతు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిని కార్యక్రమంలో ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి, ఉండ్రాజవరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ బూరుగుపల్లి సుబ్బారావు, వేలివెన్నులో సొసైటీ అధ్యక్షులు బూరుగుపల్లి కష్ణ బ్రహ్మానందం, చివటం కొఠారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తాళ్లపూడి. గజ్జరం మెయిన్‌ రోడ్‌ లో గల వైఎస్‌ఆర్‌ విగ్రహానికి సర్పంచ్‌ డాక్టర్‌ గండి రాంబాబు ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యుడు చిన్నబ్బాయి, వైసిపినాయకులు పాల్గొన్నారు. మలకపల్లి గ్రామంలో వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద పార్టీ నాయకులు పూలమాలలు వేసినివాళులు అర్పించారు. సీతానగరం వైయస్సార్‌ జయంతిని పురస్కరించుకొని మదర్‌ థెరిసా సెంటర్లో జిల్లా సేవాదళ్‌ అధ్యక్షులు మరియు ఆత్మా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బాబు, ఉప సర్పంచ్‌ ద్వారంపూడి రామకష్ణ ఆధ్వర్యంలో కేక్‌ కటింగ్‌ చేశారు. పలువురు వద్దులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మద్దాల కొండలరావు, కాండ్రు వీరన్న, దాకే రఘు, మట్ట కాపు తదితరులు పాల్గొన్నారు. కడియం వైఎస్‌ఆర్‌ జయంతిని వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఆధ్వర్యంలో కడియం సొసైటీ బ్యాంకు, రైతు భరోసా కేంద్రం నందు నిర్వహించారు. ఉత్తమ రైతులు గెద్దాడ విఘ్నేష్‌, వారణాసి బ్రహ్మాజీ, పడాల పెద్ద సత్యనారాయణ, బండారు భాస్కరరావు తదితరులను సన్మానించారు. అనంతరం కడియం దేవి గుడి సెంటర్లో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడియపులంకలో డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు , తాడాల చక్రవర్తి , యీలి గోపాలం , జేగురుపాడులో గ్రామ సర్పంచ్‌ స్టాలిన్‌ తదితరుల ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ జయంతి నిర్వహించారు. చాగల్లు వైఎస్‌ఆర్‌ జయంతిని చిక్కాల గ్రామంలో సుంకర రాయుడు, బ్రాహ్మణగూడెంలో ఆత్కూరి దొరయ్య, గూడపాటి శ్రీమన్నారాయణ, మార్కొండపాడులో ఎంపిపి మట్టా వీరస్వామి తదితరులు వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు పూలమాలలువ వేసి నివాళులు అర్పించారు.