Jan 30,2023 22:39

ప్రజాశక్తి-గోపాలపురం ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని చెరుకుమిల్లి గ్రామ సర్పంచ్‌ ముళ్ళపూడి వరలక్ష్మి అన్నారు. పంచాయతి కార్యాలయం వద్ద ముళ్ళపూడి విష్ణుమూర్తి జ్ఞాపకార్థం ఆయన సోదరుడు శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సర్పంచ్‌ వరలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ వరలక్ష్మి, హిలియస్‌ వైద్యులు డాక్టర్‌ కంభంపాటి లలిత (గైనకాలజిస్ట్‌), డాక్టర్‌ కవి కొండల రఘు (ఆర్థో, ట్రామాకేర్‌) మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలడన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా జీవితం గడపాన్నారు. ప్రతినెల రెండు క్యాంపులు అనేక ప్రాంతాల్లో నిరుపేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అంద జేస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎం.సత్యనారాయణ ఎం.వివేక్‌ గుబ్బల రమేష్‌ పాల్గొన్నారు.