Mar 31,2023 23:21

104 వాహనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి వనిత

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌
ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని హోం మంత్రి డాక్టర్‌ తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో 104 అంబులెన్స్‌ వాహనాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు అదనంగా మరో పదహారు 104 వాహనాలను కేటాయించారన్నారు. ఒక్కొక్క వాహనాన్ని రూ.24 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేశారన్నారు. వీటిలో 15 వాహనాలను వివిధ మండలాలకు కేటాయించామన్నారు. ఒక వాహనం స్పేర్‌గా ఉంచి అవసరం మేరకు వినియోగిస్తామని తెలిపారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ముప్పై నాలుగు 104 అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటి ద్వారా అన్ని అనారోగ్యాలకు వైద్య సేవలు అందిస్తారన్నారు. గర్బిణిలకు, బాలింతలకు వైద్య పరీక్షలు సైతం నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.