Jun 20,2023 00:20

ప్రజాశక్తి -గోకవరం
మండల కేంద్రమైన గోకవరం మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం మండలంలోని వివిధ గ్రామ సచివాలయలలో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటరీ పోస్టులకు ఎంపికైన గ్రామ వాలంటీర్లుకు ఎంపీపీ సుంకర శ్రీవల్లి చేతులు మీదుగా నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు అందరూ సిఎం జగన్‌ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను మీకు ఇచ్చిన కుటుంబాల పరిధిలో ప్రతి ఇంటికి చేరవేయాలన్నారు. ఇంటిలో ఉండే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు వాలంటరీలందరు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానిక మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఉనుకురి ఏసురత్నం, తోలేటి రాంప్రసాద్‌, అల్లాడ రాంబాబు నాయకులు పాల్గొన్నారు .
రైటప్‌- నియామక పత్రాలు అందజేస్తున్న ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు