Feb 01,2023 23:46

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా అభివద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామని హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు. బుధవారం కొవ్వూరు పట్టణం 23వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి మూడేళ్ల పాలనలో అభివద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులకు మూడేళ్లగా అమలు చేసిన పథకాల గురించి అడిగి, ప్రభుత్వం పేద నిరుపేదల సంక్షేమ పథకాలు వివరాలు ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించా మన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి కోడూరి శివరామకృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్న కుమారి, జెడ్‌పి వైస్‌ చైర్‌పర్సన్‌ పోసిన శ్రీలేఖ, బి.శ్రీకాంత్‌ పాల్గొన్నారు.