ప్రజాశక్తి-యంత్రాంగం ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలుపుతో టిడిపి ఆధ్వర్యాన శుక్రవారం పలుచోట్ల సంబరాలు జరిపారు. నిడదవోలులో టిడిపి శ్రేణులు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకుని విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పేరూరి సాయిబాబా, తెలుగు యువత పట్టణ మాజీ అధ్యక్షులు ఎస్‌కె.బాబు, మాజీ కౌన్సిలర్ కైకరపు సత్యనారాయణ, వాకలపూడి వెంకట రత్నం, గుడ్ల బుజ్జి, కొండపల్లి నరేష్, మండలి కిషోర్, మద్దుకూరి శ్రీనివాస్, మద్దుకూరి రాధా, గజ్జరపు శ్రీనివాస్, భోగిరెడ్డి రామ కృష్ణ, కె.లీలా కుమార్, సుంకవల్లి శ్రీధర్, హరిదాసు కాశీ, హరిదాసు వెంకటేశులు, గుండాల మునియ్య, బెల్లంకొండ శ్రీను, పంపా ధన రాజు, దావీదు, వై.శీను, గారపాటి హరి, శెట్టే రామారావు, మట్టా వెంకట్రావు, కోడికోట సత్యం, ఉప్పల సాంబశివ రావు, ఈతకోట రాజు పాల్గొన్నారు. గోకవరం అభ్యర్థిని కంచుమర్తి అనురాధ విజయం సాధించడం పట్ల శుక్రవారం మండల టిడిపి అధ్యక్షులు మంగరౌతు రామకృష్ణ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కార్యకర్తలు, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ గోకవరం గ్రామపంచాయతీ నుంచి దేవీచౌక్ మీదుగా తహశీల్దారు కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు మాట్లాడుతూ టిడిపికి విజయం చేకూర్చడం రాష్ట్రానికి శుభ పరిణామన్నారు. గోపాలపురంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకటరాజు సీనియర్ నాయకులు కొర్లపాటి అన్నవరం ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ ఎంఎల్‌ఎ వంగలపూడి అనిత పుట్టినరోజు వేడుకను టిడిపి మండల మహిళా నాయకురాలు ఆలపాటి దుర్గాభవాని భారీ కేక్ కట్ చేసి స్వీట్ పంచారు. రాజానగరంలో మాజీ ఎంఎల్‌ఎ పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యాన బైకు ర్యాలీ నిర్వహించారు. సూర్యారావుపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.










