ప్రజాశక్తి - గోపాలపురం, కడియం
గోపాలపురం మండలంలోని చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-94 బ్యాచ్ పదోతరగతి విద్యార్థుల సమ్మేళనం సోమవారం ఉత్సాహంగా జరిగింది. ఆనాటి జ్ఞాపకాలు వరు నెమరు వేసుకున్నారు. నాటి గురువులను ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కషి చేస్తామని తెలిపారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చదువు చెప్పిన గురువులను మర్చిపోకుండా వారిని గౌరవించడం తమ బాధ్యత అన్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతిని చూసి గర్వంగా ఉందన్నారు. కడియం జడ్‌పి ఉన్నత పాఠశాలలో 2001-02 పదోతరగతి విద్యార్థుల సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. సుమారు 80 మంది మిత్రులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆ పాత మధురాలను పంచుకున్నారు. తమను తాము పరిచయం చేసుకుంటూ తరగతిలో చేసిన అల్లరి చేష్టలను మరొక్కసారి గుర్తు చేసుకున్నారు. ఎం.సురేష్, జగతా చంద్రశేఖర్, కాళ్ల శ్రీను, చల్లా వీరబాబు, షేక్ వల్లీ, వనుం గంగాభవాని, మానస, చిక్కాల జ్యోతి, విశాలాక్షి మిత్రుల వివరాలను సేకరించారు.










