Feb 21,2023 23:11

మళయాళ నాటకం లిబ్‌లో ఓ సన్నివేశం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో భారత్‌రంగ్‌ మహోత్సవ్‌-23 ఉత్సాహంగా సాగుతోంది. మూడవ రోజు మంగళవారం మళయాళ నాటకాన్ని ప్రదర్శించారు. కేరళలో పాలకాకడ్‌కు చెందిన అస్పోర్టివ్‌ థియేటర్‌ వారు 'లిబ్‌'(లెట్‌ ఇట్‌ బ్రదర్‌) నాటకాన్ని ప్రదర్శించారు. అలియార్‌.కె దీనికి దర్శకత్వం వహించారు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా తన ప్రాంతీయ కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో స్థాపించడానికి ముందు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కళాకారులకు ప్రపంచ స్థాయి నాటకరంగ ప్రదర్శనలను ప్రదర్శించడానికి 2023 ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు భారత్‌ రంగ్‌ మహోత్సవ్‌ను నిర్వహిస్తోంది.
మతిమరుపుతో బాధపడుతున్న ఒక లైబ్రేరియన్‌ జ్ఞాపకం గురించి, మరణించిన తాత కుంజంబు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన గ్రామ గ్రంథాలయంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ కథ నడుస్తోంది. పుస్తకాలను ఎంతగానో ఇష్టపడే లైబ్రేరియన్‌ గురించి, అతను పుస్తకంలో చాలా పాత్రలను అలాగే అనేక భాషలలో రచయితలను పోయిన పుస్తకం పేజీని తిరిగి పొందేందుకు శోధిస్తున్న సమయంలో కలుసుకుంటాడు. తన జాబితాలోని అనేక పుస్తకాలలో నెరుడా, దోస్తోవ్స్కీ, షేక్‌స్పియర్‌, షేనా, కాఫ్కాతో సహా ప్రపంచంలోని అనేక భాషల రచయితలతో అతను సంభాషిస్తాడు. అలాంటి లైబ్రరీ గత జ్ఞాపకం మాత్రమే అని అతను వెతికి తెలుసుకోవడం మరియు పోగొట్టుకున్న పేజీపై ద్ణుఖంతో అతని ఆఖరి దినముని స్వాగతించడంతో కథ ముగుస్తుంది. సతీష్‌, లీల, సురేష్‌ ,జోష్‌ కోషి, అలియార్‌, నారాయణ ఇదంఉలో నటించారు. ఇందులో లైబ్రేరియన్‌గా సత్యజిత్‌, ఆడ ఎలుకగా మాలుదాస్‌, మగ ఎలుకగా సన్నోజ్‌ నటన ఆకట్టుకుంది. నారాయణ పి.సత్యజిత్‌ నేపథ్య సంగీతాన్ని అందించారు.