Oct 14,2023 22:57

ప్రజాశక్తి - గోకవరం
సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. సిఎం జగన్‌కు తమ డిమాండ్‌లను పోస్టు కార్డుపై రాసి పంపించారు. కోరుకొండ మండల యుటిఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ వారం రోజుల పాటు పోస్ట్‌ కార్డుల ఉద్యమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యుటిఎఫ్‌ గౌరవాధ్యక్షులు మండపాక భాస్కర్‌, జిల్లా నాయకులు మోతిక శ్రీనివాస్‌, గింజల వీర శివబాబు, ప్రధాన కార్యదర్శి పి లోవరాజేష్‌, దాడి శివశంకర్‌, అంకం సత్యనారాయణ, ఎఎల్‌వై ప్రసాద్‌, సిహెచ్‌ శ్రీనివాస్‌, ఎస్‌ గుబ్బాలు, కె.వీరబాబు పాల్గొన్నారు.