ప్రజాశక్తి-కడియం
దుళ్ల నెంబర్-1 ఎంపిపి పాఠశాల ఉపాధ్యాయుడు దొరబాబు ఫిలంత్రోఫిక్ సొసైటీ ఇండియా వారు అందజేసే మెరిటోరియస్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. రాజమహేంద్రవరం ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘ భవనంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం, కాకినాడ ఆర్‌జెడి నాగమణి, రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, జెడ్‌పి ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు చేతుల మీదుగా ఈ అవార్డును దొరబాబు అందుకున్నారు. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల పట్ల అత్యధిక శ్రద్ధ కనపరుస్తూ, ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తామని ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఇండియా అధ్యక్షులు అద్దంకి రాజా తెలిపారు. అవార్డుకు ఎంపికైన మాస్టారును ఎంఇఒ లజపతిరారు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు చిలుకూరు శ్రీనివాస్ మాస్టర్, ప్రధానోపాధ్యాయుడు గెడ్డం ఆనంద్, పిఎంసి ఛైర్మన్ గోపి వెంకటరామ బ్రహ్మం, గ్రామ సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, దుళ్ళ గ్రామ వైసిపి అధ్యక్షులు తాతపూడి బాబి తదితరులు అభినందించారు.










