May 01,2023 16:04

ప్రజాశక్తి-కడియం : గత కొన్ని నెలలగా లో ఓల్టేజ్ సమస్య ఎదుర్కొంటున్న కడియం ఎస్సీ కాలనీలో  సమస్య తీరింది. 40 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ తో లోడ్ అధికమై అక్కడి వినియోగదారులు తరచూ లో ఓల్టేజ్ సమస్య ఎదుర్కొనేవారు. తరచూ విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడేది. పరిస్థితి గమనించిన కడియం మండల విద్యుత్ శాఖ అధికారి రామారావు అదనంగా మరో 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్  ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి లో ఓల్టేజ్ సమస్యకు తెరపడింది. ప్రస్తుతం వేసవి దృష్ట్యా విద్యుత్ డిమాండ్ పెరిగిందని లో ఓల్టేజ్ సమస్య తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే దిశగా చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు.