అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి : రాష్ట్ర టిడిపి ఎస్సీ సెల్ కార్యదర్శి భరత్
ప్రజాశక్తి- గోకవరం : గోకవరం మండలం నుండి మట్టిని ఇతర దూర ప్రాంతాలకు తరలిస్తున్న అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి గునిపె భరత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానికులు మట్టి మాఫియాని ఆపాలని ఈవిషయమై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు విన్నవించుకోగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని వీరలంకపల్లి సమీపంలో ఉన్న 86 ఎకరాలు గల రాజు చెరువులో అక్రమంగా మట్టిని ఇటుక బట్టీలకు లేఔట్లుకి ఇతర దూర ప్రాంతాలకు రాజు చెరువులో మట్టిని తరలించుకు పోతున్నారని గోకవరం మండలం టిడిపి నాయకులు కార్యకర్తలు అంతా కలిసి రాజు చెరువు వద్దకు చేరుకొని రాజు చెరువులో అక్రమంగా తరలించకపోతున్న మెట్టి మాఫియా జెసిబి భారీ లారీలను మట్టి అక్రమంగా తవ్వకాలు ఆపాలంటూ నినాదాలు చేస్తూ జెసిబిలను మట్టి ఉన్న భారీ లారీలుకి అడ్డుగా నిలబడి ఆపడం జరిగిందని తెలిపారు. గతంలో ఇదే రాజు చెరువులో అనేక మార్లు మట్టిన తరలించుకు పోవడాన్ని కూడా అడ్డుకున్నామని తెలిపారు. మట్టి మాఫియా వల్ల కొంతమంది బడా నాయకులు కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు తమ జీబుల్లో నింపుకుంటున్నారని తెలిపారు. చెరువులో మట్టిని చెరువుగట్టుకి వెయ్యాలే తప్ప ఇతర దూర ప్రాంతాలకు ఇటుక బట్టీలకు లేఔట్లకు తరలించకపోకూడదని హెచ్చరించారు. భరత్ సంబంధిత అధికారులను ఫోన్లో వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెప్పి దాటవేశారు అని తెలిపారు. మౌనంగా ఉన్న అధికారుల పైన కాంట్రాక్టర్ పైన జిల్లా కలెక్టర్ వారు చర్యలు తీసుకోవాలని తెలిపారు.










