ప్రజాశక్తి - ఉండ్రాజవరం : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా గత పది రోజులుగా కొనసాగుతున్న టిడిపి నిరాహార దీక్ష శుక్రవారం మండలంలోని సత్యవాడ లో నిర్వహించారు. నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషా రావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కె ఎస్ జవహర్, హాజరై మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, ఉండ్రాజవరం మండల టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, కోమట్ల పల్లి వెంకట సుబ్బారావు, నిడదవోలు నియోజకవర్గ టిడిపి మహిళాధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి బుగ్గే శివ రామకృష్ణ శాస్త్రి, ఎంపీటీసీ ఇసుకపల్లి ప్రభావతి, ఉప సర్పంచ్ పి.ప్రసాదరాజు, పెరవలి అతికాల శ్రీను, నియోజవర్గ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ ఛార్జ్ లు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు,యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










