Sep 27,2023 12:25

ప్రజాశక్తి- పెరవలి మండలం(తూర్పుగోదావరి జిల్లా) : జాతీయ తెలుగుదేశం పార్టీ అద్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  అరెస్ట్ కు,నిరసనగా నియోజకవర్గంలో  సామూహిక నిరాహార దీక్షలు  చెయ్యాలని అధిష్టానం పిలుపు మేరకు బుధవారం జాతీయ రహదారి-16 ముక్కామల సెంటర్ రోడ్డులో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు  కుందుల వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం విభాగ కార్యదర్శి అనపర్తి జయ వాకలపూడి వెంకటరత్నం జనసేన మండల అధ్యక్షులు పిప్పర రవి మల్లుల దాసం భాస్కరరావు వీరబాబు కరటూరి రవి చౌదరి అక్కినే రమేష్ గండేపల్లి హనుమంత్ వాకలపూడి వెంకటరత్నం  భాస్కర్ రావు తెలుగుదేశం జనసేన నియోజవర్గ నాయకులు కార్యకర్తలు నిరసన దీక్షలో పాల్గొన్నారు.