Feb 08,2023 16:46

ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా) : కానూరు అగ్రహారం గ్రామంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు  బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో బుధవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి  కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన  గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొందరికి ఒకచేత్తో ఇస్తూ మరో చేత్తో అందరి వద్ద పన్నులు రూపంలో 10రెట్లు అధికంగా దోచుకుంచుటున్న విధానాన్ని ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వంలో కానూరు అగ్రహారం గ్రామ ప్రజల కోరిక మేరకు 15 లక్షల రూపాయలతో కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసి స్లాబు వరకు నిర్మిస్తే ఇప్పటి ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. జగనన్న ఇళ్ల పట్టాలు  గ్రామంలో 120 మంది అర్హులను గుర్తించి ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని దీన్ని బట్టి ఆలోచిస్తే నూటికి పదిమందికి ప్రభుత్వ పథకాలు ఇచ్చి మిగిలిన 90 శాతం ప్రజలను మోసం చేయడమే జగన్ ప్రభుత్వ ఉద్దేశం అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు దాసం బాపన్నాయుడు మాజీ డి సి ఎం యస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ  మండల అధ్యక్షులు అతికాల రామకృష్ణమ్మ (శ్రీను) రాజమహేంద్రవరం పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు రామాంజనేయులు  వాకలపూడి వీర్రాజు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్తిరాజు మంగం రామారావుది_ తెలుగు యువత అధ్యక్షులు హనుమంతు సుబ్రహ్మణ్యం ముళ్ళపూడి రాజేంద్రప్రసాద్, కొమ్మిశెట్టి వెంకట కృష్ణారావు,  శిరిగినీడి శేషగిరిరావు, హరిదాసు చిన్నా,  బీరా సామ్యేల్రాజు, పిల్లి గోపన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.