Sep 16,2023 14:08

ప్రజాశక్తి - ఉండ్రాజవరం: ముఖ్యమంత్రి నిడదవోలు పర్యటన నేపథ్యంలో మండలానికి చెందిన జెఎస్పి, టిడిపి నాయకుల హౌస్ అరెస్ట్ పిరికిపంద చర్య అన్నారు. రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి, తాడిపర్రు సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు. శనివారం కాపు నేస్తం విడుదల కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గానికి చేరుకుంటున్న ముఖ్యమంత్రిని కలిసి, రాష్ట్ర సర్పంచులకు సంబంధించి వివిధ సమస్యలు, రైతులకు తరచూ నష్టం కల్పిస్తున్న ఎర్ర కాలువ వంటి అనేక సమస్యలపై వినతి పత్రం సమర్పించేందుకు వెళుతున్నారనే కారణంతో  ముందస్తుగా కే సావరం గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణను తెల్లవారుజామున ఆయన ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ లు రామకృష్ణను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మెండే శ్రీనివాసు, ఎంపీటీసీ కాకర్ల కరుణాకర్, నిమ్మల సాంబమూర్తి, మాజీ ఎంపిటిసిలు సకినాల సత్యనారాయణ, పోలిశెట్టి శ్రీనివాసరావు, కాకర్ల జయరాజు, నార్ని చిన్న వెంకన్న, నార్ని ప్రసాదు, మండల కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.