Sep 23,2023 11:12

ప్రజాశక్తి-నల్లజర్ల : నల్లజర్లలో మూడవరోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు అనంతరం భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ స్థానిక పార్టీ కార్యాలయం నుండి నల్లజర్ల బస్టాండ్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ తమనాయకుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని రానున్న రోజుల్లో న్యాయం తోపాటు ప్రజలంతాకలిసి ఈ రాక్షస పాలనను అంతమొందించి రామరాజ్యాన్ని రాష్ట్రంలో ఏర్పాటుచే సే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవహర్ మాట్లాడుతూ చదువు సంధ్య లేని ప్రజాస్వామ్యంలో విలువలు సైతం లేని ఒక వ్యక్తి పరిపాలనలో ఈ రాష్ట్రం ఉందన్నారు అలాంటి వ్యక్తి చంద్రబాబును అరెస్టు చేసి శునకానందం పొందుతున్నాడు అన్నారు. రాష్ట్రంలో ఇద్దరు రాహువు కేతువులు బయలుదేరారని జగన్ మోహన్ రెడ్డి కళ్ళల్లో వారు ఆనందాన్ని చూడాలని ఈ అరెస్టుకు నాంది పలికారన్నారు. వారిలో ఒకరు ఎఐజి సుధాకర్ రెడ్డి మరొకరు సిఐడి ఆఫీసర్ సంజయ్ అన్నారు. పొలిటిబ్యూర సభ్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఐటీ రంగం అభివృద్ధి ద్వారా రెండు లక్షల 13వేల మంది ఉపాధి పొందుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ముఖ్యమంత్రి వద్ద సలహాదారులుగా ఉన్న ప్రేమ చంద్రారెడ్డి, అజయ్ కల్లాం, లను అరెస్టు చేయకుండా సంబంధం లేని చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. తాను కూడా సంబంధం లేని ఓ హత్య కేసులో 54 రోజులు అదే జైలు అదే బ్లాక్లో ఉన్నానన్నారు అక్కడి ఎలాంటి ఘోర పరిస్థితులు ఉంటాయో తనకు తెలుసు అన్నారు. ప్రభుత్వాన్ని గద్దతించి సంబంధిత వ్యక్తులకు నిద్రలేని రాత్రులు కల్పించే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు, ఉంగుటూరు నియోజకవర్గ పరిశీలకులు షేక్ మీరా సాహెబ్, నల్లజర్ల మండల పార్టీ అధ్యక్షులు తాతిన సత్యనారాయణ. మండల నాయకులు యలమాటి శ్రీనివాసరావు, పసుమర్తి రతీష్, యద్దనపూడి బ్రహ్మ రాజు, మాజీ మండల అధ్యక్షులు, జమ్ముల వీర వెంకట సతీష్. బేతిన సత్యనారాయణ, బలుసు గంగరాజు, సంకు శ్రీనివాసరావు, మద్దిపాటి సుబ్బరావు తదితరులు పాల్గొన్నారు.