టూరిస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్‌పి సుధీర్‌కుమార్‌రెడ్డితో పోలీసు సిబ్బంది
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సిటీ
నగరంలోని పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన టూరిజం పోలీస్‌స్టేషన్‌ను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్, డిజిపి రాజేంద్రనాద్‌రెడ్డి, హోం మంత్రి తానేటి వనిత మంగళవారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఇన్‌ఛార్జి ఎస్‌పి సిహెచ్.సుధీర్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ టూరిజం పోలీస్‌స్టేషన్ 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ మేరకు పోలీస్‌స్టేసన్‌కు 9121101112తో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది 08813 2471273 నెంబరులో స్టేషన్ హౌస్ ఆఫీసర్ మొబైల్ నెంబర్ 9440796532లో ప్రజలకు అందుబాటులో ఉంటారాన్నరు. ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు 24బై7 అందుబాటులో ఉంటారన్నారు.










