Jul 01,2023 23:14

ఎపిఇపిడిసిఎల్‌ ఎడిఇకి వినతిపత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - కొవ్వూరు
ట్రూఅప్‌ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఎపిఇపిడిసిఎల్‌ ఎడిఇ సిపిఎం నాయకులు వనివారం ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు డి.రాధాకృష్ణ, పడాల గంగాధరరావు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్‌ నియంత్రణ మండలి కలిసి వివిధ రూపాల్లో ప్రజలపై విపరీతంగా భారాలు వేస్తున్నాయని విమర్శించారు. 2014లో వాడిన విద్యుత్‌పై యూనిట్‌కు 20 పైసలు, 2021 మే నెలలో వాడిన విద్యుత్‌ యూనిట్‌కు మరో 20 పైసలు, 2023 ఏప్రిల్‌లో వాడిన విద్యుత్‌ యూనిట్‌కు 40 పైసలు కలిపి మొత్తం ఒక యూనిట్‌పై 80 పైసలు వేసి వసూలు చేస్తున్నారన్నారు. ఇవి కాక కస్టమర్‌ఛార్జీలు, లేటు ఫీజులు, ఇంధన ఛార్జీలు అంటూ అనేక రూపాల్లో భారాలు మోపుతున్నారని విమర్శించారు. వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వేళాపాళా లేని విద్యుత కోతలను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.