Mar 31,2023 23:19

నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - నిడదవోలు
విద్యుత్‌ ట్రూ అప్‌ ఛార్జీల భారం వెంటనే ఉపసంహరించుకోవాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిడదవోలు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచలేదని ఒక వైపున నోటిఫికేషన్‌ జారీ చేస్తూ, మరో వైపు సర్దుబాటు ఛార్జీల పేరుతో దొడ్డి దారిన భారాలు వేయడం దారుణమన్నారు. ఏప్రిల్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఇక నుంచి ప్రతి నెలా యూనిట్‌కు 40పైసల చొప్పున అదనంగా ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేస్తారన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మరో వైపు స్మార్ట్‌ మీటర్లు పేరుతో మరో దోపిడీ ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. వెంటనే భారాలు ఉపసంహరించుకోవాలని డిిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టి.నాని, అనిల్‌, వి.ప్రభాకర్‌రాజు, ఆనంద్‌, లెనిన్‌, నాగేంద్ర, సురేష్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు