Feb 20,2023 23:08

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం టార్గెట్ల పేరుతో అధికారుల వేధింపులను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం దగ్గర ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. తపాలా ఉద్యోగుల సంఘం కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ సోమవారం నుంచి 23వ తేదీ వరకు అశాస్త్రీయమైన టార్గెట్లకు వ్యతరేకంగా నిరసన కార్యక్రమాలు చేయనున్నట్టు తెలిపారు. తపాలా ఉద్యోగులపై ఆచరణ సాధ్యం కాని టార్గెట్లు విధిస్తున్నారని, ఇంతక ముందు కేవలం మార్చి నెలకు మాత్రమే పరిమితమైన టార్గెట్లు, ఇప్పుడు సంవత్సరం మొత్తం టార్గెట్స్‌ విధించి ఉద్యోగులను వేదింపులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతి రోజూ ఏదోక పేరుతో టార్గెట్స్‌ విధించటం అధికారులు మానుకోవాలని ఆయన హితవు పలికారు. అనంతరం పోస్టల్‌ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు.