ప్రజాశక్తి - పి.గన్నవరం
రాష్ట్ర ప్రజలు వైసిపి పాలనలో విసిగి పోయారని, ప్రజలకు మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో టిడిపిని బలపర్చి గెలిపించాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహఖ కార్యదర్శి డొక్కా నాథ్ బాబు అన్నారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో విజయం పట్ల ముంగండ టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు పితాని రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం ఎంపిపి అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు అధ్యక్షతన విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచారు. ఈ కార్యక్రమానికి నాథ్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పి.గన్నవరం సర్పంచ్ బొండాడ నాగమణి మాట్లాడారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపికి ప్రజలు పట్టం కట్టి బ్రహ్మరథం పడతారన్నారు. టిడిపి అధికారంలోకొస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టిడిపిని బలపరిచి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సంసాని పెద్దిరాజు, మట్టపర్తి రామకృష్ణ, జిల్లా నాయకులు మందపాటి కిరణ్‌కుమార్, అనిత, మాజీ సర్పంచి నేలపూడి దుర్గారావు, పెచ్చెట్టి వెర్రియ్య, పిఎసిఎస్ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటసతీష్, కుడుపూడి శీను, బొడ్డు గోపాలకృష్ణ, బి.సత్తిబాబు, నందెపు తాత, భావన పట్టాభి, చప్పిడి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.










