ప్రజాశక్తి - రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారికి వసతి సౌకర్యాల కల్పనపై ఆ పార్టీ నాయకులు సమాలోచనలు జరిపారు. మోరంపూడి సెంటర్‌లోని గన్నీస్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో మహానాడు వసతి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, రూరల్ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షులు కె.ఎస్.జవహర్, మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంఎల్‌ఎలు బండారు సత్యానందరావు, గన్ని వీరాంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, మాజీ జెడ్‌పి చైర్మన్ జ్యోతుల నవీన్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు యర్రా వేణుగోపాలరాయుడు, ఆదిరెడ్డి వాసు, మన్నవ మోహనకష్ణ, చిట్టాబత్తిన చిట్టిబాబు, వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజమహేంద్రవరం వేదికగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఫంక్షన్ హాల్స్, హోటల్స్, ఇతర స్థలాలను పరిశీలనలోకి తెచ్చారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు మార్గాని సత్యనారాయణ, ఆళ్ళ ఆనందరావు, బాబూ ఖాన్, జక్కంపూడి అర్జున్, వాసిరెడ్డి బాబి, కోరుమెల్లి విజయశేఖర్ పాల్గొన్నారు.










