May 07,2023 15:11

ప్రజాశక్తి - కడియం : కడియం శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి శిక్షణా శిబిరం కరపత్రం మరియు గోడ పత్రిక ను రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ తరగతులను విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకునేలా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడియం గ్రంథాలయ అధికారిణి శెట్టిపల్లి శ్రీదేవి నిర్మల, విద్యార్థుల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.