ప్రజాశక్తి-పెరవలి : మండలం వేసవి విజ్ఞాన శిబిరం 34 వ రోజు సందర్భంగా పెరవలి గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు అస్మిక తనిఖీ నిర్వహించారు. అంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి పుస్తకాల చదవడం వలన విజ్ఞానం సంపాదించుకొని మంచి రంగాల్లో పోటీగా నిలబడాలని ఆట పాటలు సంగీతం డ్రాయింగ్ కవితలు ప్రతి ఒక్కరు పోటీతత్వం అలవర్చుకోవాలని బోధించారు. ముక్కామల శాఖాగ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ కార్యక్రమం 34వ రోజులో భాగంగా రిసోర్స్ పర్సన్ ఏ .దుర్గ భవాని నీతి కథలు చదివించి, కథల పుస్తకాలు చదివి పుస్తక సమీక్ష చేయించడం జరిగినది. సిర్ర సంగీత్ కుమార్ ప్రస్తుతం జనరేషన్ వాడుతున్నటువంటి లాప్టాప్ ద్వారా యానిమేషన్స్ లో భూమి ఆకాశం జంతువులు మొదలగు చిత్రాలను చూపించారు. కె.ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాలు వాటి ప్రత్యేకతల గురించి వివరంగా తెలియజేశారు. ఉపాధ్యాయుల కె.వెంకటేశ్వర్లు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడమైనది విరామ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేసి అనంతరం క్యారమ్స్ ఆడించడమైనది. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకులు కె.వెంకటేశ్వరరావు ఎం.వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.










