ప్రజాశక్తి-చాగల్లు : మండల కేంద్రం చాగల్లు శాఖ గ్రంధాలయం నందు మరియు మండలంలోని చంద్రవరం శాఖా గ్రంధాలయం నందు సోమవారం వేసవి శిక్షణ శిబిరాలు ఘనంగా ప్రారంభించబడ్డాయి. చాగల్లు శాఖ గ్రంధాలయం నందు ఉప సర్పంచ్ ముళ్లపూడి ఉదయభాస్కర్, చంద్రవరం శాఖా గ్రంధాలయం నందు గ్రామ సర్పంచ్ మద్దిపాటి శ్రీరామమూర్తి ప్రారంభించారు. వీరు ఇరువురు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎండలో తిరగకుండా ఈ వేసవి శిబిరాన్ని వినియోగించుకొని గ్రంథాలయంలో గల వివిధ రకాల విజ్ఞాన వినోద కథలను చదువుకోవాలని అన్నారు. పుస్తక పఠనం వల్ల మేధస్సు పెరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా సమ్మర్ క్యాంపు పాస్టర్ ను ఆవిష్కరించారు. 40 రోజులపాటు జరిగే ఈ సమ్మర్క్ క్యాంపు విద్యార్థిని విద్యార్థులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చాగల్లుఎంపీటీసీ సభ్యులు సానబోయిన అర్జున్ రావు, గ్రంథ పాలకులు గద్దె శ్రీనివాసరావు, కె. సుమన్ కుమార్, గ్రామ పెద్దలు, పాఠకులు విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.










